Telugu Global
Telangana

వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్

వీఆర్‌ఏల సర్దుబాటుపై మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు సీఎం కేసీఆర్. ఉప సంఘం రేపటి(బుధవారం)నుంచి వీఆర్‌ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంది.

వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్
X

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సహాయకులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈరోజు సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీఆర్ఏలను విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు నీటి పారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. వీఆర్‌ఏల సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని, వారి అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.


వీఆర్‌ఏల సర్దుబాటుపై మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు సీఎం కేసీఆర్. ఉప సంఘం రేపటి(బుధవారం)నుంచి వీఆర్‌ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంది. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ వారంలోపు పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని అన్నారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడిఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న కార్యదర్శుల వివరాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్ చేస్తారు.


First Published:  11 July 2023 4:39 PM GMT
Next Story