Telugu Global
Telangana

నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలు

ఇక ప్రచారంలో భాగంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు కేసీఆర్.

నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలు
X

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత దూసుకుపోతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల కంటే రెండు అడుగు ముందే ఉన్నారు. రోజూ మూడు నియోజకవర్గాల చొప్పున సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేప‌డుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు కేసీఆర్.

ఇక ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు గులాబీ బాస్‌. హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం మిర్యాలగూడలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. మిర్యాలగూడ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు మరోసారి బరిలో ఉన్నారు. ఇక సాయంత్రం దేవరకొండలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని రవీంద్ర కుమార్‌ను ఆశీర్వ‌దించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తారు.

ఇక ప్రచారంలో భాగంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ పాలనలో ఎలా ఉండేది.. తెలంగాణ వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శల దాడి చేస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్‌ను ఆశీర్వదించాలని.. అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలను కోరుతున్నారు. నవంబర్ 9 వరకు కేసీఆర్‌ నియోజకవర్గాల్లో బిజిబిజీగా గడపనున్నారు. నవంబర్‌ 9న నామినేషన్ దాఖలు చేస్తారు.

First Published:  31 Oct 2023 2:24 AM GMT
Next Story