Telugu Global
Telangana

ఆ విషయంలో సీఎం కేసీఆరే ఆదర్శం: మంత్రి కేటీఆర్

టాలెంట్ ఉంటే ఏ కులంలో ఉన్నా సక్సెస్ సాధించవచ్చని అన్నారు. సీఎంఎస్‌టీఈఐ కార్యక్రమం ద్వారా 500 మంది వ్యవస్థాపకులుగా మారారని అన్నారు.

ఆ విషయంలో సీఎం కేసీఆరే ఆదర్శం: మంత్రి కేటీఆర్
X

ఆ విషయంలో సీఎం కేసీఆరే ఆదర్శం: మంత్రి కేటీఆర్

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఒటమి ఎదురైందని అక్కడితో ఆగిపోకూడదు. మరింత ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో సీఎంఎస్‌టీఈఐ ఆధ్వర్యంలో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెట్ మీట్ నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదని మంత్రి చెప్పారు. ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని చెప్పడానికి సీఎం కేసీఆర్ జీవితమే మంచి ఉదాహరణ అని చెప్పారు. ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ చాలా ఇబ్బందిపడ్డాను. కానీ ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు.

కుల వ్యవస్థ అనేది కేవలం మనుషులు మాత్రమే సృష్టించారు. దేవుడికి కులాలతో సంబంధం లేదు. కులాలు, కుల వ్యవస్థ గురించి నాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తెలిసిందని కేటీఆర్ తెలిపారు. టాలెంట్ ఉంటే ఏ కులంలో ఉన్నా సక్సెస్ సాధించవచ్చని అన్నారు. సీఎంఎస్‌టీఈఐ కార్యక్రమం ద్వారా 500 మంది వ్యవస్థాపకులుగా మారారని అన్నారు. సక్సెస్ అయిన ప్రతీ ఒక్కరు తమ కథలను తండాలలో అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలన్నారు.

దళితబంధుతో ఎంతో మంది వ్యవస్థాపకులుగా మారారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. విజయాలు సాధించినవారు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా మారాలని కేటీఆర్ సూచించారు. ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 3న మరోసారి విజయం సాధించిన తర్వాత సక్సెస్ మీట్ జరుపుకుందామని కేటీఆర్ ధీమాగా చెప్పారు.

First Published:  2 Nov 2023 8:19 AM GMT
Next Story