Telugu Global
Telangana

తెలంగాణలో కొత్తగా 13 మండలాలు

అత్యధిక గ్రామాలు ఉండటంతో పరిపాలనకు ఆటంకం కలుగుతోంది. దీంతో పలు విజ్ఞప్తులు పరిశీలించిన తర్వాత కొత్త మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

తెలంగాణలో కొత్తగా 13 మండలాలు
X

తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలను ఏర్పాటు చేశారు. ఇటీవల పలు ప్రాంతాల నుంచి మండలాల ఏర్పాటుకు అభ్యర్థనలు వచ్చాయి. స్థానిక అవసరాలు, పరిపాలనలో సంస్కరణల అమలులో భాగంగా ఈ మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని మండల కేంద్రాలకు గ్రామాలు దూరంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒకే మండలంలో అత్యధిక గ్రామాలు ఉండటంతో పరిపాలనకు ఆటంకం కలుగుతోంది. దీంతో పలు విజ్ఞప్తులు పరిశీలించిన తర్వాత కొత్త మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలాలకు సంబంధించిన జీవోను ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. నిజామాబాద్ జిల్లాలో 3, జగిత్యాల, నారాయణపేట్‌లో రెండు, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 13 మండలాలు ఏర్పాటు చేశారు.

కొత్త మండలాలు ఇవే..

- నల్లగొండ : గట్టుప్పల్

- మహబూబ్‌నగర్ : కౌకుంట

- నిజామాబాద్ : ఆలూర్, సాలూర, డొంకేశ్వర్

- మహబూబాబాద్ : సీరోల్

- సంగారెడ్డి : నిజాంపేట్

- కామారెడ్డి : డోంగ్లీ

- జగిత్యాల : ఎండపల్లి, భీమారం

- నారాయణపేట్ : గుండుమల్, కొత్తపల్లె

- వికారాబాద్ : దుడ్యాల్

First Published:  23 July 2022 11:26 AM GMT
Next Story