Telugu Global
Telangana

కాంగ్రెస్సోడు రైతుబంధు ఎన్నిరోజులు ఆప్తడు? 3 తారీఖు మళ్లీ మనదే ప్రభుత్వం

కేసీఆర్‌ బతికి ఉండంగ రైతుబంధు ఆగడమా? అది అయ్యే పనేనా?". ఆంధోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్సోడు రైతుబంధు ఎన్నిరోజులు ఆప్తడు?  3 తారీఖు మళ్లీ మనదే ప్రభుత్వం
X

రైతుబంధు ఆపామని కాంగ్రెస్‌ నేతలు విర్రవీగిపోతున్నారన్నారు సీఎం కేసీఆర్. "కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టింది. ఒక్క రైతుబంధుతోనే బీఆర్‌ఎస్‌ గెలుస్తదా?. ఇయ్యాల ఆప్తవ్‌. రేపు ఆప్తవ్. ఇలా ఎన్ని రోజులు ఆప్తవ్‌? 3 తారీఖు మా ప్రభుత్వం వస్తది. 6 తారీఖు నుంచి ఎప్పటిలాగే రైతుబంధు పైసలు పడుతయి. కేసీఆర్‌ బతికి ఉండంగ రైతుబంధు ఆగడమా? అది అయ్యే పనేనా?". ఆంధోల్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు.

"గెలుపు కోసం కాంగ్రెసోళ్లు చెయ్యని చిల్లర పనులు లేవు. రైతుబంధు వేయకుండా కాంగ్రెసోళ్లు అడ్డుకున్నరు. ఈసీ దగ్గరికి పోయి కంప్లెయింట్‌ ఇచ్చారు. మళ్లీ మేం వెళ్లి ఇది కొత్త పథకం కాదు, ఆరేండ్ల నుంచి వేస్తున్నం పర్మిషన్‌ కావాలని అడిగాం. దాంతో మంగళవారం రైతుబంధు వేసేందుకు ఈసీ పర్మిషన్‌ ఇచ్చింది. కానీ కాంగ్రెసోళ్లు మళ్లీ వెళ్లి రైతుబంధు ఆపాలని దరఖాస్తు ఇచ్చారు". కాంగ్రెస్‌ వల్లే ఇవాళ రైతుబంధు పైసలు రాకుండా అయ్యాయన్నారు సీఎం కేసీఆర్.

ధరణిపై కాంగ్రెస్ విమర్శలకు చెక్ ..

"అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంల వేస్తమని కాంగ్రెస్‌ నేతలు అంటున్నరు. అక్రమాలను అరికట్టేందుకే నేను ధరణి పోర్టల్‌ తెచ్చిన. మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి ఇంకొకరి పేరు మీదకు మారే అవకాశం లేకుండా చేసిన. సీఎం తలుచుకున్నా మీ భూమిని ఇంకొకరి పేరు మీదకు మార్చలేడు". మరి ఇంత మంచి సౌకర్యాన్ని ఉంచుకుంటరో, పోగొట్టుకుంటరో? మీ ఇష్టమని ఓటర్లకు వివరించారు సీఎం కేసీఆర్.

First Published:  27 Nov 2023 3:23 PM GMT
Next Story