Telugu Global
Telangana

అదానీ స్కాంపై సీజేఐ విచార‌ణ చేప‌ట్టాలి: బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్‌

హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీల షేర్లు 27 శాతం దిగజారిపోయాయని బీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. ఈ మొత్తం వ్యవహారం లో విచారణ చేపడితే అన్ని విషయాలు బైటపడతాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బడా వ్యాపారవేత్తలు స్నేహితులుగా ఉన్నారని అందుకే ప్రభుత్వం నోరు మెదపడం లేదని కేకే ఆరోపించారు.

అదానీ స్కాంపై సీజేఐ విచార‌ణ చేప‌ట్టాలి: బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్‌
X

అదానీ పై హిడెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ మీద చర్చ జరగాలంటూ పార్లమెంటులో బీఆరెస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్క‌రించిన తర్వాత ప్రతిపక్షాల నిరసనల నడుమ స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఆ నేపథ్యంలో పార్లమెంటు భవనం వెలపల బీఆరెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ) లేదా ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ( సీజేఐ) తో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీల షేర్లు 27 శాతం దిగజారిపోయాయని బీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. ఈ మొత్తం వ్యవహారం లో విచారణ చేపడితే అన్ని విషయాలు బైటపడతాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బడా వ్యాపారవేత్తలు స్నేహితులుగా ఉన్నారని అందుకే ప్రభుత్వం నోరు మెదపడం లేదని కేకే ఆరోపించారు.

ఈ అంశంపై తాము వాయిదా తీర్మానం ప్రవేశపెట్టామని, దీనిపై చర్చ జరగాలని పార్లమెంటులో కోరామని అయితే స్పీకర్ తిర్స్కరించడం, సభను వాయిదా వేయడం అప్రజాస్వామికమని కేకే అన్నారు.

బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై, అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కోరితే సభను వాయిదా వేయడమేంటని బీఆరెస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు.

గుజరాత్ వ్యాపారుల కోసమే మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని బీఆరెస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అదానీ స్కాంపై, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న పద్దతుల పట్ల ఇతర రాష్ట్రాలను కలుపుకొని దేశ‌వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన అన్నారు.

First Published:  2 Feb 2023 10:24 AM GMT
Next Story