Telugu Global
Telangana

మౌనవ్రతంలో ఉన్నా.. నేను మాట్లాడను

పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న తనను పదే పదే మాట్లాడించాలని చూసిన న్యూస్ టీవీ రిపోర్టర్ తో చిరంజీవి ఈ మాటలన్నారు. ప్రస్తుతం చిరు మౌనవ్రతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మౌనవ్రతంలో ఉన్నా.. నేను మాట్లాడను
X

మౌన వ్రతంలో ఉన్నవారెవరైనా మాట్లాడతారా..? పోనీ తాను మాట్లాడను అనే విషయాన్నయినా నోటితో చెబుతారా..? కానీ చిరంజీవి మాత్రం తాను మౌనవ్రతంలో ఉన్నానంటూ మీడియా ప్రతినిధికి చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద చిరు హాస్యాన్ని పండించారు. పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న తనను పదే పదే మాట్లాడించాలని చూసిన న్యూస్ టీవీ రిపోర్టర్ తో చిరంజీవి ఈ మాటలన్నారు. ప్రస్తుతం చిరు మౌనవ్రతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ రోజు సినీ సెలబ్రిటీల ఓటింగ్ కార్యక్రమం మీడియాకు పెద్ద పండగగా మారింది. హీరోలు, వారి కుటుంబ సభ్యులు.. ఎవరు వచ్చినా అలర్ట్ గా ఉండి వారి వెంటబడి మరీ ఫొటోలు, వీడియోలు తీశారు మీడియా ప్రతినిధులు. కానీ పోలింగ్ కేంద్రంలో మీడియాతో మాట్లాడటానికి నటీనటులు వెనకడుగు వేశారు. తమని వెంటాడుతున్న కెమెరామెన్లను.. మీరు ఓటు వేయరా అంటూ ప్రశ్నించారు జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి మాత్రం ఇలా వెరైటీ సమాధానం చెప్పి నవ్వులు పూయించారు.

చిరంజీవి అయ్యప్ప మాలలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి రాగానే ఆయనను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలకు చిరు సంతోషంగానే రియాక్ట్ అయ్యారు. పదే పదే మీడియా ప్రతినిధులు మైక్ ముందు పెడుతుండే సరికి ఆయన కూడా ఇబ్బందిపడ్డారు. అందుకే మౌనవ్రతం అంటూ మాట్లాడనన్నారు. అయినా కూడా వదిలిపెట్టకుండా వెంటపడే సరికి గొంతుబాగోలేదని చెప్పి తప్పించుకున్నారు.


First Published:  30 Nov 2023 9:14 AM GMT
Next Story