Telugu Global
Telangana

బీఆర్ఎస్‌లో విలీనమైన ఛత్రపతి శాసన్.. సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన మహిళా నాయకులు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో మహిళా అభ్యుదయం కోసం ఈ సంఘం పని చేస్తోంది.

బీఆర్ఎస్‌లో విలీనమైన ఛత్రపతి శాసన్.. సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన మహిళా నాయకులు
X

మహారాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర పైనే పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తరచుగా అక్కడ పర్యటిస్తూ పార్టీకి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలే కాకుండా.. ఇతర పార్టీల నాయకులు కూడా బీఆర్ఎస్ పట్ల అభిమానం పెంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలను కూడా బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. తాజాగా ఛత్రపతి శాసన్ మహిళా అగాడీ అనే సంఘం బీఆర్ఎస్‌లో విలీనం అయ్యింది.

మహారాష్ట్రలో మహిళా చైతన్యానికి ప్రతీకగా ఉన్న ఈ సంఘంలో 10వేల మందికి పైగా కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో మహిళా అభ్యుదయం కోసం ఈ సంఘం పని చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, తెలంగాణలో మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షించబడి.. సంఘం అధ్యక్షఉరాలు దివ్య మేగ్దం.. తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తన సంఘాన్ని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు దివ్య ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలను మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి.. కేంద్రంలో కిసాన్ సర్కార్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని దివ్య మేగ్దం అన్నారు.

వార్ధా జిల్లా హింగన్ ఘాట్‌ పట్టణానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఉమేశ్ ఎస్ వావేర్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. గతంలో సర్పంచ్‌గా సేవలందించడంతో పాటు ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇక ఎన్సీపీకి చెందిన ప్రొఫెసర్ జావిద్ పాషా బీఆర్ఎస్‌కు మద్దతు పలికారు. మహారాష్ట్రలోని పలు జిల్లాలకు చెందిన వేర్వేరు పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. మహారాష్ట్రకు చెందిన 100 మంది సర్పంచ్‌లు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

First Published:  23 Aug 2023 12:48 AM GMT
Next Story