Telugu Global
Telangana

చంద్రబాబే నన్ను కాంగ్రెస్‌లోకి పంపించారు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే తనను కాంగ్రెస్ పార్టీలోకి పంపారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీకి కోడలు లాంటి వాడిని అని ఆయన‌ చెప్పారు.

చంద్రబాబే నన్ను కాంగ్రెస్‌లోకి పంపించారు
X

మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్‌లోకి తోలిందే చంద్రబాబు అని చెప్పారు. చర్లపల్లి జైల్లో తాను చిప్పకూడు తిన్నానని.. ఆ చిప్ప మీద ప్రమాణం చేసి చెబుతున్నా తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి తీరుతామన్నారు. తానేమీ దొంగతనం చేసి జైలుకు పోలేదని, కేసీఆర్ దోపిడికి వ్యతిరేకంగా పోరాడే వెళ్లానని రేవంత్ చెప్పారు.

కొందరు తనను చంద్రబాబు మనిషి అంటున్నారని.. ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిచారని ఆ విషయం గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోవడంతో చంద్రబాబు అటు దిక్కు వెళ్లిపోయాడని.. తనను తీసుకోండి అని కాంగ్రెస్ దిక్కు చంద్రబాబు తోలి వెళ్లిపోయారని ఇందులో తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌ పార్టీకి కోడలు లాంటి వాడిని అని రేవంత్ రెడ్డి చెప్పారు.

మన ఇంటి ఆడ బిడ్డ మరో ఇంటికి వెళ్తుందని.. మరో ఇంటి బిడ్డ కోడలుగా వస్తుందని.. ఒకసారి కోడలుగా వచ్చినతర్వాత ఆ ఇంటి గౌరవం నిలబెట్టే బాధ్యత కోడలు పైనే ఉంటుందన్నారు. తాను కూడా కాంగ్రెస్‌కు కోడలు లాగా వచ్చానని. కాంగ్రెస్ గౌరవం నిలబెడుతానని చెప్పారు.

First Published:  23 Sep 2022 6:16 PM GMT
Next Story