Telugu Global
Telangana

ఆయనను అలా వదిలేయకండిరా... ఎవరికైనా చూయించండిరా..

భ్రమల్లోనుంచి ఆయన ఎన్నటికీ బైటపడే పరిస్థితి కనిపించడ‍లేదు. ఎన్ని విమర్శలొచ్చినా... తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగడానికి ఇలాంటి అహంకారపు మాటలే ఒక కారణమని తెలిసినా ఆయన మాటను, నడత‌నుమార్చుకోవడంలేదు. ఆయనే ఘనత వహించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు.

ఆయనను అలా వదిలేయకండిరా... ఎవరికైనా చూయించండిరా..
X

నేనే హైదరాబాద్ కట్టించాను...నేనే కంప్యూటర్ కనిపెట్టాను...నేనే ఐటీ రంగాన్ని హైదరాబాద్ కు తెచ్చాను... మేమే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పించాం....మేమే తెలంగాణ ప్ర‌జలకు వ్యవసాయం నేర్పించాం...నేనే తెలంగాణ ప్రజలకు నాగరికత నేర్పించాను..... నేనే...నేనే...నేనే... ఈ నేనే బాబు ఎవరో ఈ పాటికి గుర్తుపట్టి ఉంటారు.

ఈ భ్రమల్లోనుంచి ఆయన ఎన్నటికీ బైటపడే పరిస్థితి కనిపించడ‍లేదు. ఎన్ని విమర్శలొచ్చినా... తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగడానికి ఇలాంటి అహంకారపు మాటలే ఒక కారణమని తెలిసినా ఆయన మాటను, నడత‌నుమార్చుకోవడంలేదు. ఆయనే ఘనత వహించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు.

ఈయన మాటలపట్ల తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆయనకు తెలియదా ? ఆయనకు తెలియకపోతే కనీసం తెలంగాణ టీడీపీ నాయకులైనా చెప్పడానికి సాహసించరో కానీ మళ్ళీ ఆయన తాజాగా పాత పాటనే వల్లె వేశారు.

ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయుడు గారు “తెలంగాణలో టీడీపీ రాకముందు మొక్కజొన్న, రాగులు, సజ్జలు మాత్రమే తినేవాళ్లు. అప్పటి టిడిపి ప్రభుత్వం కేజీకి రూ. 2 బియ్యం పథకాన్ని ప్రారంభించిన తర్వాత మాత్రమే వారు తెల్ల అన్నం తినడం నేర్చుకున్నారు. అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సంపద సృష్టికి, అభివృద్దికి టీడీపీయే కారణమన్నారు. తెలంగాణలో జీవన ప్రమాణాలను ట్డీపీయే పెంచిందని, తెలంగాణలోని వెనకబడిన వర్గాల నాయకులను పార్టీ ప్రోత్సహించిందని పేర్కొన్నారు.

నిజానికి పాఠ్యపుస్తకాలనుండి చరిత్రను, సోషల్ సైన్సెస్ ను తీసివేయాలని ప్రయత్నించి చంద్రబాబుకు చరిత్ర అంటే మహా కోపం. ఎందుకంటే చరిత్ర అనేక నిజాలని మన కళ్ళ ముందు నిలిపి ఎవరి పాత్ర ఏంటో తేల్చి పారేస్తుంది. అందుకే చరిత్ర తెలుసుకోవడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించబోరు. కాకతీయుల కాలంలో కూడా ఇక్కడ చెరువుల కింద వరి ధాన్యాన్ని పండించారని, నిజాం కాలంలో ఘనపూర్ బియ్యం ప్రఖ్యాతి గడించాయని, అప్పటికే హైదరాబాద్ బిర్యాని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని ఆయనకు చెప్పేవారెవ్వరు ? వందల ఏళ్ళుగా తెలంగాణలో చిరు ధాన్యాలతో పాటు వరికూడా పండించారనే జ్ఞానం ఆయనకు లేక పోతే తప్పెవరిది ?

చ‍ంద్రబాబ్య్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆయనపై నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ బిర్యానీ మినుముల‌తో వండారా ? అంటూ పలువురు నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. ఇంత అహంకారం, ఇంత అజ్ఞానం ఉన్న వ్యక్తులను ఇప్పటి వరకు చూడలేదని, తెలంగాణ ప్రజలు ఆయనను ఆంధ్రాకు తరిమికొట్టినా ఆయనకు బుద్ది రాలేదని నెటిజనులు మండిపడుతున్నారు.

తెలంగాణ ప్రజలను ఇంతగా అవమానిస్తూ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో ఇంటింటికి తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు లేక పోయినా ఆయన పక్కనున్న తెలంగాణ నేతలైనా ఆయనకు చెప్పకుండా ఆత్మగౌరవం చంపుకొని భానిసలుగా బతకడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

ఆయనను అలా వదిలేయకండిరా ...ఎవరికైనా చూయించండిరా

First Published:  27 Feb 2023 12:34 AM GMT
Next Story