Telugu Global
Telangana

కోమటిరెడ్డి Vs హరీష్ రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూపై సవాళ్లు

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు హరీష్‌ రావు. తాను ఫ్యామిలీతో అమెరికా వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి వెళ్లింది.. ఏ హోటల్‌లో ఉన్నది, అన్ని వివరాలు కోమటిరెడ్డికి ఇస్తానన్నారు.

కోమటిరెడ్డి Vs హరీష్ రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూపై సవాళ్లు
X

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌ రావుల మధ్య డైలాగ్‌ వార్‌కు తెరతీసింది. ఇవాళ మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌ రావును కలిసేందుకు హరీష్ రావు అమెరికా వెళ్లారని ఆరోపించారు కోమటిరెడ్డి.

ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని ప్రభాకర్‌ రావుకు హరీష్ రావు చెప్పి వచ్చారన్న కోమటిరెడ్డి.. అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఏ విమానంలో వెళ్లింది.. ఎక్కడ కలిసింది తాను నిరూపిస్తానన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి. తాను దేనికైనా సిద్ధమేనన్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు హరీష్‌ రావు. తాను ఫ్యామిలీతో అమెరికా వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి వెళ్లింది.. ఏ హోటల్‌లో ఉన్నది, అన్ని వివరాలు కోమటిరెడ్డికి ఇస్తానన్నారు. యూఎస్‌లో ప్రభాకర్‌రావును కలిసినట్లు కోమటిరెడ్డి నిరూపిస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానన్నారు హరీష్ రావు. కోమటిరెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు.

First Published:  2 Jun 2024 12:18 PM GMT
Next Story