Telugu Global
Telangana

తెలంగాణలో పసుపు బోర్డు, రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పార్లమెంటు సాక్షిగా నిరాకరించిన కేంద్రం

బుధవారం బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, పి దయాకర్, జి రంజిత్ రెడ్డి, మాలోతు కవితలు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి లోక్‌సభలో ప్రశ్నించారు.

తెలంగాణలో పసుపు బోర్డు, రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పార్లమెంటు సాక్షిగా నిరాకరించిన కేంద్రం
X

రాష్ట్రంలో పసుపు బోర్డు, రైలు కోచ్ ఫ్యాక్టరీ కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తిరస్కరించింది.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు, కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందజేసింది. ఈ విషయమై లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు నిన్న ప్రశ్నలు సంధించారు.

బుధవారం బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, పి దయాకర్, జి రంజిత్ రెడ్డి, మాలోతు కవితలు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి లోక్‌సభలో ప్రశ్నించారు.

సుగంధ ద్రవ్యాల బోర్డు చట్టం, 1986 ప్రకారం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డుకు, పసుపు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 మసాలా దినుసులను ప్రోత్సహించే బాధ్యతను అప్పగించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు.

అందువల్ల, దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా మసాలా నిర్దిష్ట బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌కు చెందిన బిజెపి ఎంపి డి అరవింద్ ఓటర్లకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అదే విధంగా తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో హామీ ఇచ్చిన మేరకు తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా అని బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదన్నారు రైల్వే మంత్రి.

ఇప్పటికే మంజూరైన ఫ్యాక్టరీలు సమీప భవిష్యత్తులో భారతీయ రైల్వే రోలింగ్ స్టాక్‌ల అవసరాలను తీర్చడానికి సరిపోతాయి కాబట్టి కొత్త ఫ్యాల్టరీల అవసరం లేదని ఆయన అన్నారు.

First Published:  30 March 2023 1:30 AM GMT
Next Story