Telugu Global
Telangana

తెలంగాణకు కేంద్రం చెల్లించాల్సిన రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం మూడేళ్ళుగా పెండింగ్

కేంద్ర మంత్రులు చేస్తున్న‌ వాదనలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణకు గత మూడేళ్లుగా కేంద్రం రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉంది. GST ప్రారంభమైనప్పటి నుండి, తెలంగాణకు GST పరిహారంగా రూ. 16,570 కోట్లు అందాయి. ఇది దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల కంటే తక్కువ.

తెలంగాణకు కేంద్రం చెల్లించాల్సిన రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం మూడేళ్ళుగా పెండింగ్
X

కేంద్రప్రభుత్వం తెలంగాణకు నిధులుకేటాయించకపోవడం, చెల్లింపుల్లో జాప్యం చేయడమే కాకుండా జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించడం లేదు.

కేంద్ర మంత్రులు చేస్తున్న‌ వాదనలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణకు గత మూడేళ్లుగా కేంద్రం రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉంది. GST ప్రారంభమైనప్పటి నుండి, తెలంగాణకు GST పరిహారంగా రూ. 16,570 కోట్లు అందాయి. ఇది దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల కంటే తక్కువ.

2020-21,2021-22 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1,371 కోట్లు, అలాగే 2022-23కి సంబంధించి మరో రూ. 1,061 కోట్ల జీఎస్టీ పరిహారం బకాయిలను కేంద్రం ఇంకా క్లియర్ చేయలేదు.

బకాయిలు చెల్లించాలని పదే పదే విన్నవించినా నేటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేదు. ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడంతోపాటు చట్టపరమైన అవకాశాలను అన్వేషించాలని యోచిస్తోంది.

కేంద్రం GST పరిహారం సెస్ విధించడం ద్వారా రాష్ట్రాలకు పరిహారం చెల్లింస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం, అత్యధిక పరిహారం అందుకుంటున్న మొదటి ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పంజాబ్.

“ గత ఐదేళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 13.9 శాతంతో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ విధంగా, ఇతరుల కంటే మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ”అని రాష్ట్ర ఆర్థిక శాఖలోని ఒక అధికారి అన్నారు.

కేంద్రం GST పరిహారం సెస్ ముసుగులో పౌరులపై అదనపు భారాన్ని మోపి ఆదాయం పెంచుకుంది.

GST పరిహారం సెస్ 2017-18లో రూ.62,600 కోట్ల నుండి 2022-23లో రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగినప్పటికీ, రాష్ట్రాలకు చెల్లింపులు 2017-18లో రూ.49,600 కోట్ల నుండి 2020లో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్లకు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 21 మరియు 2022-23లో రూ.18,000 కోట్లకు తగ్గింది.

First Published:  13 Feb 2023 3:13 PM GMT
Next Story