Telugu Global
Telangana

నిర్భయ ఫండ్స్ రిలీజ్ లో కూడా తెలంగాణ పై కేంద్రం వివక్ష‌

అత్యాచార బాధితులకు సత్వర న్యాయం అందించే విషయంలో కూడా కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోంది. రాష్ట్రాలకు నిర్భయ ఫండ్ విడుదల‌ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద పీట‌ వేసి తెలంగాణకు అన్యాయం చేస్తోంది.

నిర్భయ ఫండ్స్ రిలీజ్ లో కూడా తెలంగాణ పై కేంద్రం వివక్ష‌
X

మహిళలపై అత్యాచారాల కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయడం కోసం, పోక్సో చట్టం కింద ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు అక్టోబర్ 2019లో కేంద్రం ఓ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (FTSCలు) ఏర్పాటు కోసం న్యాయ శాఖ ఈ పథకాన్ని మొదలుపెట్టింది. దీని కోసం కేంద్రం ప్రతి రాష్ట్రానికి నిర్భయ ఫండ్ నుండి నిధులు సమకూరుస్తుంది.

జూన్ 30, 2022 నాటికి,28 రాష్ట్రాలు, UTలలో 408 ప్రత్యేకమైన POCSO కోర్టులతో సహా 728ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ కోర్టులు 1,02,344కు పైగా కేసులను పరిష్కరించాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. అయితే గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌కు రూ.15.75 కోట్లు, కర్ణాటకకు రూ.13.5 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.56.31 కోట్లు విడుదలవ్వగా తెలంగాణకు మాత్రం రూ.8.1 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

కేంద్ర ఇప్పటికే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదనే విమర్షలున్నాయి. చివరకు అత్యాచార బాధితులకు న్యాయం చేసే విషయంలో కూడా కేంద్ర ప్రవర్తన అదే విధంగా ఉండటాన్ని టీఆరెస్ నాయకులు తప్పుబడుతున్నారు. టీఆరెస్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించడమేంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.

First Published:  6 Aug 2022 2:09 AM GMT
Next Story