Telugu Global
Telangana

అంగన్‌వాడీలకు వేతనాలు.. తెలుగు రాష్ట్రాలే టాప్‌.!

అంగన్‌వాడీలకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో అంగన్‌వాడీలకు భారీగా వేతనాలు పెంచింది.

అంగన్‌వాడీలకు వేతనాలు.. తెలుగు రాష్ట్రాలే టాప్‌.!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు పెంచాలంటూ అంగన్‌వాడీలు సమ్మె చేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు చెల్లిస్తున్న వేతనాలపై తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం సమాధానం ఇచ్చింది. ఆశ్చర్యంగా అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లకు అత్యధిక జీతాలిస్తున్న రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌ ప్లేసులో నిలిచాయి.

అంగన్‌వాడీలకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో అంగన్‌వాడీలకు భారీగా వేతనాలు పెంచింది. తెలంగాణ ప్రస్తుతం అంగన్‌వాడీలకు నెలకు 9 వేల 150 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఇక అంగన్‌వాడీ హెల్పర్లకు నెలకు రూ.5 వేల 550 చెల్లిస్తున్నారు. ఇక రెండో స్థానంలో ఏపీ నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు 7 వేల రూపాయలు వేతనం చెల్లిస్తుండగా.. హెల్పర్లకు నెలకు 4 వేల 750 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇది కేవలం రాష్ట్ర వాటా మాత్రమే. కేంద్ర వాటా కలిపితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.


ఇక కర్ణాటకలో అంగన్‌వాడీ వర్కర్లకు 6500 - 7000 వేతనంగా ఇస్తుండగా.. హెల్పర్లకు 4000 నుంచి 4500 చెల్లిస్తున్నారు. మొత్తంగా అంగన్‌వాడీలకు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ మొత్తంలో వేతనాలు ఉన్నాయి.

First Published:  8 Feb 2024 6:50 AM GMT
Next Story