Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కేసీఆర్ ను విమర్షిస్తూ 'సాలు దొర-సెలవు దొర' అంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. అటువంటి ప్రచారాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్
X

తెలంగాణ లో అధికార టీఆర్ఎస్‌పై రకరకాల ఆరోపణలతో విరుచుకపడుతున్న బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. 'సాలు దొర-సెలవు దొర' అంటూ కేసీఆర్ పై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణం ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

రాజకీయ పార్టీల నేతలను కించపరిచేలా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 'సాలు దొర-సెలవు దొర' ప్రచారానికి ఎన్నికల సంఘం మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. 'సాలు దొర-సెలవు దొర' ప్రచారానికి అనుమతి కోరుతూ బీజేపీ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి దరఖాస్తు చేసింది. బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

కొద్ది రోజుల క్రితం బీజేపీ కార్యాలయం బయట 'సాలు దొర ‍ సెలవు దొర' అంటూ కొన్ని డిజిటల్ ప్రకటనలు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను విమర్శిస్తూ ఈ యాడ్ ను బీజేపీ కార్యకర్తలు వైరల్ చేశారు. అయితే అనుమతి లేకుండా పెట్టిన ఈ ప్రకటనపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకొంది. మరో వైపు టీఆర్ఎస్‌ కూడా ఈ ప్రకటనపై తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ ఆ ప్రచారాన్ని బీజేపీ ఆపలేదు. అయితే బీజేపీ ప్రచార ప్రణాళికపై ఎన్నికల సంఘం నీళ్ళు పోసింది.

First Published:  11 Aug 2022 8:34 AM GMT
Next Story