Telugu Global
Telangana

గాంధీ భవన్ వద్ద సంబరాలు.. తాజ్ కృష్ణ వద్ద రెడీగా బస్సులు

గెలిచిన అభ్యర్థుల్ని ధృవీకరణ పత్రాలతో సహా వెంటనే హైదారాబాద్ కి తరలించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముందుగా ఎమ్మెల్యేలందర్నీ హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ కి తరలించి అటునుంచి అటే కర్నాటక తీసుకెళ్తారని తెలుస్తోంది.

గాంధీ భవన్ వద్ద సంబరాలు.. తాజ్ కృష్ణ వద్ద రెడీగా బస్సులు
X

కాంగ్రెస్ పార్టీ తొలి గెలుపు(అశ్వారావుపేట) అధికారికం కావడం, మెజార్టీ దిశగా అడుగులు పడుతుండటంతో గాంధీ భవన్ వద్ద సంబరాలు మొదలయ్యాయి. టపాకాయలు కాల్చి కార్యకర్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మీడియా హడావిడి కూడా గాంధీ భవన్ వద్ద కనిపించింది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకాలు చేస్తున్నారు.


ఇక గెలిచిన అభ్యర్థుల్ని ధృవీకరణ పత్రాలతో సహా వెంటనే హైదారాబాద్ కి తరలించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముందుగా ఎమ్మెల్యేలందర్నీ హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ కి తరలించి అటునుంచి అటే కర్నాటక తీసుకెళ్తారని తెలుస్తోంది. కర్నాటకలో క్యాంపు రాజకీయం మొదలుపెట్టి దాదాపుగా అక్కడే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత అందరినీ హైదరాబాద్ కి తరలిస్తారని సమాచారం. ఇప్పటికే లగ్జరీ బస్సుల్ని హోటల్ దగ్గర సిద్ధంగా ఉంచారు. గెలిచినవారంతా లగేజీతో సహా తాజ్ కృష్ణ హోటల్ కి రావాలని సందేశాలు పంపారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాతో ఉన్నా.. ఎమ్మెల్యేలు చేజారకుండా వ్యూహాలు సిద్ధం చేయడం అధిష్టానానికి అంతకంటే పెద్ద పనిగా మారింది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పరిశీలకుడిని ఏఐసీసీ నియమించింది. గెలిచినవారిని హైదరాబాద్ కి తరలించే బాధ్యత ఆ పరిశీలకులకే అప్పజెప్పింది. ఈ ఎపిసోడ్ మొత్తానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతల్ని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతుల్లో పెట్టింది.


First Published:  3 Dec 2023 6:46 AM GMT
Next Story