Telugu Global
Telangana

త్వరలో టీఎస్ఆర్టీసీ ఈ-టికెట్.. చిల్లర కష్టాలకు చెక్

ప్రస్తుతం ఈ సాఫ్ట్‌ వేర్‌ ను ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే.. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా నగదు రహిత టికెట్‌ ను అందుబాటులోకి తెస్తుంది.

త్వరలో టీఎస్ఆర్టీసీ ఈ-టికెట్.. చిల్లర కష్టాలకు చెక్
X

"టిక్కెట్టుకి సరిపడ చిల్లర ఇవ్వండి.. కండక్టర్ కి సహకరించండి" అంటూ ఆర్టీసీ బస్సుల్లో స్లోగన్లు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడంలేదు. చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాల ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కుని వెళ్తుంటారు జనం. అలాంటిది ఆర్టీసీలో ఇంకా పాత పద్ధతి ఏంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి. దీనికి సమాధానంగా త్వరలో టీఎస్ఆర్టీసీ ఈ టికెటింగ్ విధానాన్ని తెరపైకి తెస్తోంది. డబ్బులుంటే సరే సరి, లేకపోతే టికెట్ రేటెంతో కనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ మెసేజ్ చూపిస్తే టికెట్ ఇచ్చేస్తారు.

తెలంగాణ ఆర్టీసీ ఏడాది క్రితమే ఈ ప్రయోగం మొదలు పెట్టింది కానీ, కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేదు. మళ్లీ ఇప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ తో పగడ్బందీగా ఈ టికెటింగ్ ని తెరపైకి తెస్తోంది. బస్సుల్లో క్యూఆర్ కోడ్ ని పెట్టబోతోంది. దాదాపుగా అందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లున్నాయి. ఆర్థిక లావాదేవీలన్నీ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా స్మార్ట్ గా ఆలోచించింది. చిల్లర సమస్యకు చెక్ పెడుతోంది.

సిటీబస్సుల్లో ప్రయోగం..

ప్రస్తుతం ఈ సాఫ్ట్‌ వేర్‌ ను ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే.. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ నగదు రహిత టికెట్‌ ను అందుబాటులోకి తెస్తుంది. ఈ-టికెట్లు అందుబాటులో ఉన్నా కూడా నగదుతో కూడా టికెట్ అందించే సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది.

First Published:  19 July 2023 4:02 AM GMT
Next Story