Telugu Global
Telangana

రఘునందన్‌ రావుపై కేసు.. ఎందుకంటే.!

సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో పండబెట్టి తొక్కుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలయ్యేంత వరకు రఘునందన్ అనే పేరు తీయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

రఘునందన్‌ రావుపై కేసు.. ఎందుకంటే.!
X

మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రఘునందన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకీ రఘునందన్ ఏమన్నారంటే.. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయ‌న.. తన పేరు తీస్తే గుడ్డలూడదీసి కొడతానంటూ మాజీ మంత్రి హరీష్‌, కొత్త ప్రభాకర్ రెడ్డిలనుద్దేశించి కామెంట్ చేశారు. సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో పండబెట్టి తొక్కుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలయ్యేంత వరకు రఘునందన్ అనే పేరు తీయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రఘునందన్‌ రావు. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, బీఆర్ఎస్ నుంచి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.

First Published:  2 April 2024 1:06 PM GMT
Next Story