Telugu Global
Telangana

కామ్రేడ్ల పోటీ.. ఖమ్మంలో కారుకు కలిసొస్తుందా..?

ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీలో గళం వినిపించాలని సీపీఎం, సీపీఐ ఉవ్విళ్లూరాయి. అయితే మొదట బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ వాళ్ల‌ను లైట్ తీసుకున్నాయి.

కామ్రేడ్ల పోటీ.. ఖమ్మంలో కారుకు కలిసొస్తుందా..?
X

కామ్రేడ్ల పోటీ.. ఖమ్మంలో కారుకు కలిసొస్తుందా..?

తొలుత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ ఇద్దరికీ స్నేహహస్తం చాచి, భంగపడిన సీపీఎం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. తొలి విడతగా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 7 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్న ఖమ్మంలో కామ్రేడ్ల పోటీతో రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. సీపీఎం చీల్చబోయే ఓట్లతో హ‌స్తానికి దెబ్బ పడుతుందా..? కారుకు చొట్ట పడుతుందా అనేది ఆసక్తికరం.

బలం చాటుకోవాలనే ప్రయత్నం

ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీలో గళం వినిపించాలని సీపీఎం, సీపీఐ ఉవ్విళ్లూరాయి. అయితే మొదట బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ వాళ్ల‌ను లైట్ తీసుకున్నాయి. దీనితో తమ బలమేమిటో చూపించాలని సీపీఎం బరిలోకి దిగింది. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర‌భ‌ద్రం, మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలుతుందా..?

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సీపీఎంకి గ‌ట్టి పట్టుంది. ఆయా జిల్లాల్లో సీపీఎం పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుందని, సీపీఎం పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, అదే జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం నల్లేరు మీద‌ నడకేనని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు.

First Published:  5 Nov 2023 7:20 AM GMT
Next Story