Telugu Global
Telangana

కేసీఆర్‌తో ప్ర‌వీణ్ కుమార్ భేటీ.. బీఆర్ఎస్‌లో చేరిక‌కా? బీఎస్పీతో పొత్తుకా?

ప్ర‌వీణ్‌కుమార్ బీఆర్ఎస్‌లో చేరి ఎస్సీ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని గ‌ట్టిగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి భేటీ ఎందుక‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

కేసీఆర్‌తో ప్ర‌వీణ్ కుమార్ భేటీ.. బీఆర్ఎస్‌లో చేరిక‌కా? బీఎస్పీతో పొత్తుకా?
X

బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్‌కుమార్ గులాబీ బాస్‌ను క‌లిశారు. తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వీరిద్ద‌రి భేటీకి ప్రాధాన్యం ఏర్ప‌డింది. మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను తీవ్రంగా విమ‌ర్శించిన ప్ర‌వీణ్‌కుమార్ స‌డన్‌గా ఆయ‌న్ను క‌ల‌వ‌డం ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌ల‌కు దారితీసింది.

బీఆర్ఎస్‌లో చేరతారా?

బీఎస్పీని రాష్ట్రంలో విజ‌య‌ప‌థంలో న‌డిపి త‌మ పార్టీ గుర్తు ఏనుగు మీద ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వ‌స్తాన‌ని ప్ర‌వీణ్‌కుమార్ ఎన్నిక‌ల ముందు శ‌ప‌థం చేశారు. ఆయ‌న పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 1.37% ఓట్లు మాత్ర‌మే తెచ్చుకోగ‌లిగింది. ప్ర‌వీణ్‌కుమార్ సిర్పూర్‌లో 44,646 ఓట్లు మాత్ర‌మే తెచ్చుకుని మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌వీణ్‌కుమార్ బీఆర్ఎస్‌లో చేరి ఎస్సీ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని గ‌ట్టిగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి భేటీ ఎందుక‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

బీఎస్పీతో పొత్తుకు ఒప్పించ‌డానికా?

అయితే బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని లోక్‌స‌భ ఎన్నిక‌లకు వెళుతుంద‌ని కాంగ్రెస్ నేత మ‌ల్లు ర‌వి చెబుతున్నారు. బీఎస్పీతో పొత్తు ఎస్సీ, ఎస్టీ ఓట్ల‌ను పార్టీకి ద‌గ్గ‌ర చేస్తుంద‌ని కేసీఆర్ భావిస్తూ ఉండొచ్చు. ఓప‌క్క బీజేపీ, మ‌రోప‌క్క కాంగ్రెస్ త‌మ నేత‌ల‌ను, త‌మ ఓట్ల‌ను ప‌ట్టుకుపోతున్న నేప‌థ్యంలో కేసీఆర్ బీఎస్పీతో పొత్తుకు ప్ర‌య‌త్నిస్తున్నారా అనే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. వీటిలో నిజ‌మేంటో తెలియాలంటే ప్ర‌వీణ్‌కుమారే చెప్పాలి.

First Published:  5 March 2024 11:03 AM GMT
Next Story