Telugu Global
Telangana

గిగ్‌ వర్కర్స్‌తో కేటీఆర్ మాటామంతీ

గిగ్ వర్కర్స్‌ పని చేస్తున్న సంస్థ, యూనియన్, గవర్నమెంట్ భాగస్వామిగా ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూల నిధి ఏర్పాటు చేసి అవసరమైన సమయంలో గిగ్‌ వర్కర్స్‌ను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు కేటీఆర్.

గిగ్‌ వర్కర్స్‌తో కేటీఆర్ మాటామంతీ
X

గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమం కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్‌. ఈ మేరకు వారితో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. గిగ్‌ వర్కర్స్ ఇప్పుడు రోజువారీ జీవితంలో భాగంగా మారారని చెప్పుకొచ్చారు. రోజువారీ అవసరాలు తీర్చేందుకు గిగ్‌ వర్కర్స్ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు.

సిటీలో ప్రస్తుతం 9.50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారన్న కేటీఆర్..ఒక్కొ ఐటీ ఉద్యోగంతో పరోక్షంగా నలుగురికి ఉపాధి కలుగుతోందన్నారు. సిటీలో ప్రస్తుతం 3.50 లక్షల మంది గిగ్‌ వర్కర్స్ ఉన్నారన్నారు కేటీఆర్‌. జాబ్ సెక్యూరిటీ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఫిక్స్‌డ్ శాలరీ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కేరళ తరహాలో ఒకే యాప్‌లో క్యాబ్‌, గ్రోసరీస్‌ ఆర్డర్ చేసుకునే వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కేరళ అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేస్తామన్నారు.


గిగ్ వర్కర్స్‌ పని చేస్తున్న సంస్థ, యూనియన్, గవర్నమెంట్ భాగస్వామిగా ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూల నిధి ఏర్పాటు చేసి అవసరమైన సమయంలో గిగ్‌ వర్కర్స్‌ను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు కేటీఆర్. లీగల్ సెల్ ఏర్పాటు చేసి సంస్థలు ఒప్పందాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జనవరిలో మళ్లీ సమావేశమవుతానని గిగ్‌వర్కర్స్‌కు హామీ ఇచ్చారు.


First Published:  27 Nov 2023 2:56 PM GMT
Next Story