Telugu Global
Telangana

సీఎం పోస్టుపై కేటీఆర్ కామెంట్స్‌..!

వివిధ పత్రికల ఎడిటర్లతో చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ వారితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

సీఎం పోస్టుపై కేటీఆర్ కామెంట్స్‌..!
X

సీఎం అవ్వాలన్న కోరిక తనకు లేదని స్పష్టంచేశారు కేటీఆర్. 80 స్థానాలతో బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ ఖాయం అన్న కేటీఆర్.. వచ్చే ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి లేకున్నా సంతోషమేనన్నారు. ఇక వచ్చే టర్మ్‌లో ప్రజా దర్బార్ కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న కామెంట్స్‌ను కొట్టిపారేశారు. కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం పాటిస్తున్నామన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత మహారాష్ట్రపై ఫోకస్ పెడతామన్నారు కేటీఆర్. మహారాష్ట్రలో 10-15 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.

వివిధ పత్రికల ఎడిటర్లతో చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ వారితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇక ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ హామీని తప్పుపట్టారు కేటీఆర్. దాన్ని తిరోగమన ఆలోచనగా అభివర్ణించారు. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోకు విలువే లేదన్నారు.


కరోనా వల్ల తెలంగాణ బడ్జెట్‌కు లక్ష కోట్ల నష్టం జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. దాంతో సిటీలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌, మూసీ సుందరీకరణ లాంటి పనులు చేయలేకపోయామన్నారు. దేశంలో మరే నగరంలో లేని విధంగా హైదరాబాద్‌ సిటీలో వందశాతం సీవరెజ్‌ ట్రీట్‌మెంట్ చేస్తున్నామని చెప్పారు.

First Published:  25 Nov 2023 2:48 AM GMT
Next Story