Telugu Global
Telangana

30 వేల ఉద్యోగాల భర్తీ.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్‌

ఫస్ట్ కేబినెట్‌లోనే మెగా డీఎస్సీ ద్వారా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని రేవంత్ చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంపై నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఆలోచించాలని కేటీఆర్ కోరారు.

30 వేల ఉద్యోగాల భర్తీ.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్‌
X

సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటున్నారని, దమ్ముంటే ‌ఆ ఉద్యోగాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్, నిర్వహించిన రాత పరీక్షల తేదీలు రిలీజ్ చేయాలని ఛాలెంజ్ చేశారు. సీఎం స్థాయిలో ఉండి కూడా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.


రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు కేటీఆర్. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి.. ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్‌ కూడా రిలీజ్ చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్‌ - 1 నోటిఫికేషన్‌ రద్దు చేశారని కేటీఆర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫస్ట్ కేబినెట్‌లోనే మెగా డీఎస్సీ ద్వారా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని రేవంత్ చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంపై నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. యూత్‌ డిక్లరేషన్‌లో ప్రియాంక గాంధీ చేత నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని చెప్పి.. నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌న్నారు కేటీఆర్.

ఇక పోటీ పరీక్షల ఫీజు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి రాగానే రూ.400గా ఉన్న టెట్‌ ఫీజును రూ.2 వేలకు పెంచారన్నారు. జాబ్ క్యాలెండర్‌ హామీ అడ్రస్‌ కూడా లేదన్నారు కేటీఆర్.

First Published:  25 May 2024 9:56 AM GMT
Next Story