Telugu Global
Telangana

ఇది కేవలం ట్రైలర్‌.. సినిమా ముందుంది - కేటీఆర్

సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇదే పద్ధతిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్నారు. అభివృద్ధిని కొనసాగించాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.

ఇది కేవలం ట్రైలర్‌.. సినిమా ముందుంది - కేటీఆర్
X

తెలంగాణలో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు సినిమా ముందుందన్నారు. ఫస్ట్ టైమ్‌ ఓటర్లతో మాట్లాడిన కేటీఆర్‌.. తన భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించారు.

తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట, బాన్సువాడ లాంటి చిన్న పట్టణాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నెక్స్ట్ పదేళ్లలో తెలంగాణలో ఆదిలాబాద్‌, ఖమ్మం లాంటి నగరాలకు గంటన్నరలో చేరుకునేలా హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్థాయికి అభివృద్ధి చేరుకోవాలన్నారు. దీంతో పాటు 24 గంటల విద్యుత్‌ లాగే 24 గంటల వాటర్‌ రావాలన్నారు. పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రోను 410 కిలోమీటర్ల మేర విస్తరించాలన్నదే తమ ప్లాన్ అని చెప్పారు.


సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇదే పద్ధతిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్నారు. అభివృద్ధిని కొనసాగించాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కేవలం సంక్షేమమే చేస్తామంటే కర్ణాటక తరహాలో అభివృద్ధికి నిధులు ఉండవన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి 55 ఏళ్లు, బీజేపీకి 20 ఏళ్లు అవకాశం ఇచ్చామన్నారు. క్షేత్రస్థాయితో సంబంధం ఉన్న పార్టీలకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

యువత తన శక్తిని సరైన మార్గంలో వినియోగించుకోవాలన్నారు. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ రావాలన్నారు. ఏదైనా ఐడియా ఉంటే ముందుకు వచ్చి టీ-హబ్‌తో కలిసి పనిచేయాలన్నారు. రియల్ పవర్ ఆఫ్ ఇండియా యూత్ అని చెప్పారు కేటీఆర్.

First Published:  27 Nov 2023 3:37 AM GMT
Next Story