Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికలు వాయిదా.. కేటీఆర్ సంచలన కామెంట్స్‌..!

ప్రతిపక్షాల తాపత్రయం అంతా రెండో స్థానం కోసమేనన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్‌కు మరింత సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.

తెలంగాణ ఎన్నికలు వాయిదా.. కేటీఆర్ సంచలన కామెంట్స్‌..!
X

తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. అక్టోబర్‌ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు. కానీ, అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇదే జరిగితే తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్, మేలోనే జరగొచ్చన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నారు.

ఈ మేరకు మీడియాతో చిట్‌ చాట్ నిర్వ‌హించిన కేటీఆర్‌ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల తాపత్రయం అంతా రెండో స్థానం కోసమేనన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్‌కు మరింత సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్‌ 90కి పైగా స్థానాలు గెలుస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌ మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారని, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని సెటైర్లు వేశారు. తన నాయకత్వంపై నమ్మకంతోనే కేసీఆర్ సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చారన్నారు.

మోడీని బీఆర్ఎస్ విమర్శించినంత దేశంలోని మరే పార్టీ విమర్శించలేదన్నారు కేటీఆర్. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి ఏం లేదన్న కేటీఆర్‌.. ఏపీ పరిణామాలతో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

First Published:  12 Sep 2023 10:39 AM GMT
Next Story