బీఆర్ఎస్ విజయవంతం అవుతుంది, కేసీఆర్ కు ఆ శక్తి ఉంది... కుమారస్వామి
బీఆరెస్ దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతుందని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని కుమారస్వామి అన్నారు.
BY Telugu Global5 Oct 2022 11:58 AM GMT

X
Telugu Global Updated On: 5 Oct 2022 11:58 AM GMT
భారత్ రాష్ట్ర సమితి దేశ వ్యాప్తంగా విజయవంతం అవుతుందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి అన్నారు. కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని ఆయన నాయకత్వంలో బీఆరెస్ సక్సెస్ అవుతుందన్నారాయన. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని కుమారస్వామి అన్నారు. అలా జరగాలంటే బీఆరెస్ జాతీయ స్థాయిలో విజయవంతం కావాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక జాతీయ పార్టీ ఆవిర్భవించడంపై హర్షం వ్యక్తం చేశారు కుమారస్వామి. కర్నాటకలో తాము బీఆరెస్ బలపడటానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ తో కలిసి పని చేస్తామని చెప్పారు కుమారస్వామి.
Next Story