Telugu Global
Telangana

కాంగ్రెస్‌ నేతలకు BRS స్వాగతం..ఫ్లెక్సీల కలకలం.?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ సిటీలో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులకు స్వాగతం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌ నేతలకు BRS స్వాగతం..ఫ్లెక్సీల కలకలం.?
X

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య కంటిన్యూ అవుతున్న డైలాగ్‌ వార్‌తో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పీక్ స్టేజ్‌కు చేరింది. తాజాగా తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాల గురించి చిదంబరం చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారాయి. దీంతో కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు.

చిదంబరం వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు మండిపడ్డారు. తాజాగా రాష్ట్రానికి వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ సిటీలో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులకు స్వాగతం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


ఈ బ్యానర్లలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు తీసుకున్న శ్రీకాంతాచారి, పోలీసు కిష్టయ్య, ఇషాన్ రెడ్డి సహా పలువురు ఉద్యమకారుల ఫొటోలు ముద్రించారు. అయితే ఈ బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది క్లారిటీ లేనప్పటికీ.. బీఆర్ఎస్‌ నేతలే ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. గతంలోనూ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది.

First Published:  17 Nov 2023 5:10 AM GMT
Next Story