Telugu Global
Telangana

ఓట్ల చీలిక.. పార్టీల్లో టెన్షన్..!

ప్రధానంగా యుగతులసి పార్టీ దాదాపు 90కి పైగా స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో ఉంచింది. యుగతులసికి రోడ్‌ రోలర్‌ గుర్తును ఈసీ కేటాయించింది.

ఓట్ల చీలిక.. పార్టీల్లో టెన్షన్..!
X

తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాజ‌కీయ పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైంది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కారును పోలిన చపాతీమేకర్‌, రోడ్‌ రోలర్‌ లాంటి గుర్తులతో ఓట్ల చీలికపై ఆందోళన చెందుతోంది. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 2-3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనికి కారణం కారు గుర్తును పోలిన గుర్తులకు భారీగా ఓట్లు పోలవ్వ‌డమే.

ప్రధానంగా యుగతులసి పార్టీ దాదాపు 90కి పైగా స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో ఉంచింది. యుగతులసికి రోడ్‌ రోలర్‌ గుర్తును ఈసీ కేటాయించింది. ఇది బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ చపాతీమేకర్‌, రోడ్‌ రోలర్‌ అధికార పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ గుర్తుల కారణంగా కీలక అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల విజయావకాశాలు తలకిందులయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీ చేస్తుండటం కాంగ్రెస్‌ ఆందోళనకు కారణమైంది. ఎస్సీ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ చీల్చే అవకాశాలున్నాయి. దీంతో తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు బీఎస్పీ చీలిక తెచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ టెన్షన్ పడుతోంది.

First Published:  16 Nov 2023 2:46 AM GMT
Next Story