Telugu Global
Telangana

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం కు బీఆరెస్ మద్దతు

ఈ సారి కూడా ఆ స్థానానికి తమకు మద్దతు ఇవ్వవలసిందిగా ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం కు బీఆరెస్ మద్దతు
X

త్వరలో జరగనున్న ఎంఎల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం పార్టీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు పలికింది. గతంలో ఈ సీటు ఎమ్ ఐ ఎమ్ కు చెందినదే. గతంలో కూడా ఈ స్థానాన్ని బీఆరెస్ మద్దతుతో ఎంఐఎం గెల్చుకుంది.

ఈ సారి కూడా ఆ స్థానానికి తమకు మద్దతు ఇవ్వవలసిందిగా ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించిన తర్వాత హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు పలకాలని కేసీఆర్ నిర్ణయించారు.

Next Story