Telugu Global
Telangana

గ్యాస్ ధర పెంపుపై భగ్గుమన్న బీఆరెస్... రాష్ట్ర వ్యాప్త నిరసనలు

హైదరాబాద్ శివార్లలోని శేరిలింగపల్లిలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, ఐడీపీఎల్ చౌరస్తాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి .

గ్యాస్ ధర పెంపుపై భగ్గుమన్న బీఆరెస్... రాష్ట్ర వ్యాప్త నిరసనలు
X

కేంద్ర బీజేపీ సర్కార్ గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ తో సహా అని జిల్లాల్లో వేలాది మంది బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు, ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తంచేశారు.

హైదరాబాద్ శివార్లలోని శేరిలింగపల్లిలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, ఐడీపీఎల్ చౌరస్తాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి .

నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే గాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. మల్కాజిగిరి లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

ఫిలింనగర్‌ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. ధర్నాలో మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్యాస్‌ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నల్లగొండపట్టణంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అద్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు రోడ్డుపై ధర్నాకు దిగారు. కుమ్రం భీం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వందలాది మంది బీఆరెస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శ‌న నిర్వహించారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఖమ్మం ధర్నా చౌక్‌లో మంత్రి పువ్వాడ అజయ్ ఆద్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించాయి. కార్యకర్తలు నల్లజెండాలు, ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తంచేశారు. కట్టెల మోపులు నెత్తినపెట్టుకుని మహిళలు ధర్నాలో పాల్గొన్నారు.

వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, సంఘారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో కూడా బీఆరెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ సర్కార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

First Published:  3 March 2023 8:26 AM GMT
Next Story