Telugu Global
Telangana

ఇవాళే కేసీఆర్ రీ ఎంట్రీ

12 గంటల 45 నిమిషాలకు స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దాదాపు 2 నెలల విరామం తర్వాత మళ్లీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.

ఇవాళే కేసీఆర్ రీ ఎంట్రీ
X

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్‌.. తుంటి ఆపరేషన్‌ నిర్వహించడం, తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు.

మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోనున్నారు. 12 గంటల 45 నిమిషాలకు స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దాదాపు 2 నెలల విరామం తర్వాత మళ్లీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.

తర్వాత BRS శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ ను ఫస్ట్ టైమ్‌ ప్రతిపక్ష హోదాలో చూడబోతున్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First Published:  1 Feb 2024 5:43 AM GMT
Next Story