Telugu Global
Telangana

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

గాయం నుంచి కాస్త కోలుకున్న కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త‌న ఛాంబర్ లో కేసీఆర్ తో ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణం చేయించారు.

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
X

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డి నుంచి కేసీఆర్ ఓటమి చెందగా.. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఎన్నికల ముగిసిన కొద్ది రోజులకే కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. గాయం నుంచి కాస్త కోలుకున్న కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త‌న ఛాంబర్ లో కేసీఆర్ తో ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణం చేయించారు.

చాలా రోజుల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ జరిగిన తర్వాత తొలిసారి కేసీఆర్ బయటకు రావడంతో ఆయనను చూసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ వద్దకు వచ్చారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

First Published:  1 Feb 2024 11:13 AM GMT
Next Story