Telugu Global
Telangana

బీఆరెస్ పార్టీ తొలి బహిరంగ సభ... ఈ నెల 18న ఖమ్మంలో...

ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజు ఖమ్మంలో బీఆరెస్ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను ఆహ్వానించనున్నారు.

BRS Meeting in Khammam
X

తెలంగాణ రాష్ట్ర సమితి , భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తొలి బహిరంగ సభ ఈ నెల 18న జరగనుంది. మొదట ఢిల్లీలో జరపాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనే సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజు ఖమ్మంలో బీఆరెస్ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను ఆహ్వానించనున్నారు.

సంక్రాంతి తర్వాత బీఆరెస్ దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కేసీఆర్ ప్రణాళికలు రచిన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ తర్వాత ఆ ప్రయత్నాలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.

ఈ సభకు సంబంధించి నిన్న రాత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామానాగేశ్వరరావుతో పాటు పలువును ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడు పెంచుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

ఈ సభను తొలుత ఢిల్లీలో నిర్వహించాలని భావించినప్పటికీ... రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనే సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజును ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ సభకు సంబంధించి నిన్న రాత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామానాగేశ్వరరావుతో పాటు పలువును నేతలతో కేసీఆర్ చర్చించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను ఆహ్వానించనున్నారు. ఈ సభను తెలంగాణలో ఎన్నికల పర్వానికి నాందిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌, కేరళ సీఎం పినరాయి విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.

First Published:  9 Jan 2023 5:18 AM GMT
Next Story