Telugu Global
Telangana

17న బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న సీఎం కేసీఆర్!

బీఆర్ఎస్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నారు.

17న బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న సీఎం కేసీఆర్!
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ, లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం ఈ నెల 17 నిర్వహించనున్నారు. పార్టీ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తప్పకుండా హాజరు కావాలని సమాచారం అందించారు. సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తున్నది.

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అందుకే ఎలా సమాయత్తం కావాలనే విషయాలను చర్చించనున్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ పరంగా సాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలు, పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెప్పనున్నట్లు తెలుస్తున్నది.

జిల్లాల వారీగా అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే విషయాలను చర్చించడంతో పాటు.. పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను కూడా వివరించనున్నట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకలను తప్పకుండా ఉపయోగించుకొని.. పార్టీకి కూడా మంచి మైలేజీ వచ్చేలా చూడాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.


First Published:  15 May 2023 12:53 PM GMT
Next Story