Telugu Global
Telangana

క్రోధి నామ సంవత్సరం బీఆర్ఎస్ కి కలిసొస్తుందా..? పంచాంగం ఏం చెప్పిందంటే..?

బీఆర్ఎస్ అదినేత కేసీఆర్‌ది కర్కాటక రాశి కావడంతో.. ఆ రాశి ఫలితాలు చదివి వినిపించారు. ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయని, కేసీఆర్‌ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని స్పష్టం చేశారు.

క్రోధి నామ సంవత్సరం బీఆర్ఎస్ కి కలిసొస్తుందా..? పంచాంగం ఏం చెప్పిందంటే..?
X

గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ కి కాస్త చేదు అనుభవాన్ని మిగల్చగా.. ఈ ఏడాది జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయంపై ఈరోజు పంచాంగంలో కాస్త క్లారిటీ వచ్చింది. పంచాంగంలో చెప్పినవన్నీ చెప్పినట్టు జరుగుతాయా..? అని అనుమానించడం కంటే.. కాస్తో కూస్తో నిగూఢ వాస్తవం అందులో దాగి ఉంటుందనే సత్యాన్ని అందరూ గ్రహించాలి. అలాంటి సత్యాన్నే ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఉగాది పంచాంగంలో చెప్పారు వేదపండిదులు. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు.


క్రోధి సంవత్సరంలో మంచి, చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని.. వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు చక్కడా పండుతాయని తెలిపారు పండితులు. పాలక పక్షానికి కొన్ని కష్టాలు తప్పవన్నారు. ఇది పరోక్షంగా ప్రతిపక్షానికి తీపి వార్తే. ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అంటే వారు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పండితులు ఉద్భోదించారు.

బీఆర్ఎస్ అదినేత కేసీఆర్‌ది కర్కాటక రాశి కావడంతో.. ఆ రాశి ఫలితాలు చదివి వినిపించారు. ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయని, కేసీఆర్‌ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని స్పష్టం చేశారు. ఆయన చేపట్టే వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశముందన్నారు. కేసీఆర్ మాటకు, గమనానికి అడ్డు ఉండదని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని చెప్పారు. ఇక కేటీఆర్ ది మకర రాశి. కేటీఆర్‌ ఆదాయ వ్యయాలు కూడా ఈ ఏడాది సమానంగా ఉన్నాయి. ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు పండితులు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్.

First Published:  9 April 2024 11:10 AM GMT
Next Story