Telugu Global
Telangana

పొరపాటున బాబు గెలిస్తే.. రేవంత్‌తో కలిసి చేసిది ఇదే..!

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి గడువు దగ్గర పడిందన్నారు వినోద్. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తాడన్నారు.

పొరపాటున బాబు గెలిస్తే.. రేవంత్‌తో కలిసి చేసిది ఇదే..!
X

చంద్రబాబు నాయుడుపై బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గనుక పొరపాటున చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడు రేవంత్‌తో కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తాడని ఆరోపించారు.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి గడువు దగ్గర పడిందన్నారు వినోద్. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తాడన్నారు. బీజేపీ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయన్నారు వినోద్.

పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై గళం విప్పాలంటే తనను గెలిపించుకోవాలని కోరారు. మళ్లీ బండి సంజయ్‌కి అవకాశమిస్తే.. బీజేపీ కుర్చోమంటే కూర్చోవ‌డం.. లెమ్మంటే లేవ‌డం త‌ప్ప సంజ‌య్ చేసేదేమీ ఉండ‌ద‌ని మండిపడ్డారు.

First Published:  7 May 2024 11:31 AM GMT
Next Story