Telugu Global
Telangana

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు ఢిల్లీ వెళ్లి తిహార్ జైలులో కవితను కలిసిన విషయం తెలిసిందే. కవిత బెయిల్‌ కోసమే న్యాయనిపుణులతో చర్చించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తిహార్ జైలు అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం దీన్‌ దయాళ్ హాస్పిటల్‌కు తరలించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన కవిత.. గత నాలుగు నెలలుగా తిహార్ జైలులో ఉంటున్నారు. కవితపై సీబీఐ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

ఇక గత నాలుగు నెలలుగా బెయిల్‌ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు ఢిల్లీ వెళ్లి తిహార్ జైలులో కవితను కలిసిన విషయం తెలిసిందే. కవిత బెయిల్‌ కోసమే న్యాయనిపుణులతో చర్చించినట్లు సమాచారం.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను మనీ లాండరింగ్ ఆరోపణల కింద మార్చి 16న కవితను అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌. అనంతరం కవితను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. ఏప్రిల్‌లో తిహార్ జైలులో ఉండగానే సీబీఐ సైతం కవితను అరెస్టు చేసింది.

First Published:  16 July 2024 1:58 PM GMT
Next Story