Telugu Global
Telangana

నేను బాధితురాలిని.. కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నాలుగుసార్లు విచారణకు హాజరయ్యానన్న కవిత.. బ్యాంకు వివరాలు ఇచ్చి అన్ని విధాలా సహకరించానన్నారు. తన మొబైల్ ఫోన్లన్ని దర్యాప్తు సంస్థకు అందించానన్నారు.

నేను బాధితురాలిని.. కవిత లేఖ
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను బాధితురాలినన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నాలుగు పేజీలతో కూడిన ఓ లేఖను కవిత రిలీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కవిత. దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణే ఎక్కువ జరిగిందన్నారు కవిత. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రటిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు కవిత. వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ను ఛానెల్‌లలో ప్రసారం చేసి తన గోప్యతను దెబ్బతీశారన్నారు కవిత.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నాలుగుసార్లు విచారణకు హాజరయ్యానన్న కవిత.. బ్యాంకు వివరాలు ఇచ్చి అన్ని విధాలా సహకరించానన్నారు. తన మొబైల్ ఫోన్లన్ని దర్యాప్తు సంస్థకు అందించానన్నారు. ఫోన్లు ధ్వంసం చేశానని తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. రెండున్నరేళ్లుగా సోదాలు చేసి.. వేధింపులకు గురి చేశారన్నారు కవిత. సాక్షులను బెదిరించినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు కవిత.

95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలకు సంబంధించినవేనంటూ లేఖలో పేర్కొన్నారు. బీజేపీలో చేరితే వెంటనే కేసు విచారణ ఆగిపోతుందన్నారు. విపక్షపార్టీలు న్యాయవ్యవస్థ వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయన్నారు. దర్యాప్తున‌కు సహకరించేందుకు తను పూర్తి సిద్ధంగా ఉన్నానని లేఖలో చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరారు కవిత. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. తల్లిగా తనతో ఉండాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. తను లేకుంటే తన కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు కవిత. తన బెయిల్ అభ్యర్థనను మళ్లీ పరిశీలించానని కోరుతున్నానని లేఖలో చెప్పారు కవిత.

First Published:  9 April 2024 8:33 AM GMT
Next Story