Telugu Global
Telangana

ఆరు గ్యారంటీలపై రేవంత్‌కు కవిత ప్రశ్నలు

ఇప్పటికే రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని.. వారందరికీ జనవరి 1 నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 4 వేల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీలపై రేవంత్‌కు కవిత ప్రశ్నలు
X

తెలంగాణలో గురువారం నుంచి ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా పథకాలు ప్రారంభించడాన్ని కవిత తప్పుపట్టారు. పాత రేషన్ కార్డులకే పథకాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై కవిత మండిపడ్డారు.

ఇక ఇప్పటికే ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న వారి నుంచి మళ్లీ దరఖాస్తులు కోరడం ఎందుకని ప్రశ్నించారు కవిత. ఇప్పటికే రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని.. వారందరికీ జనవరి 1 నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 4 వేల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఇప్పటికీ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కాలేదన్నారు కవిత. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిందన్న కవిత.. భృతి కోసం దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు.

First Published:  27 Dec 2023 2:25 PM GMT
Next Story