Telugu Global
Telangana

కౌశిక్‌ రెడ్డి నోట జగన్‌ డైలాగ్‌.. రేవంత్‌కు వార్నింగ్‌

మీరు కొట్టారు తీసుకున్నాం.. మా టైమ్‌ వస్తుంది మేము కొడతామంటూ అప్పట్లో జగన్ చేసిన కామెంట్స్‌ వైరల్ అయ్యాయి. అదే డైలాగ్‌ను ఇప్పుడు పాడి కౌశిక్‌రెడ్డి త‌న స్ట‌యిల్‌లో రిపీట్ చేశారు.

కౌశిక్‌ రెడ్డి నోట జగన్‌ డైలాగ్‌.. రేవంత్‌కు వార్నింగ్‌
X

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌ పాపులర్‌ డైలాగ్‌ను రిపీట్ చేశారు. దానం నాగేందర్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డిలను కాంగ్రెస్‌లో చేర్చుకుని.. రేవంత్ నవ్వుతున్నారని.. ఇవాళ ఆయన కొట్టాడు మేం తీసుకున్నాం.. భవిష్యత్తులో మేం కొడతామని.. ఆ దెబ్బకు రేవంత్‌ లేవకుండా అవుతాడంటూ వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి.


2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అధినేత‌ జగన్‌ సైతం చంద్రబాబుకు ఇలానే వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొవడంపై మాట్లాడుతూ.. మీరు కొట్టారు తీసుకున్నాం.. మా టైమ్‌ వస్తుంది మేము కొడతామంటూ అప్పట్లో జగన్ చేసిన కామెంట్స్‌ వైరల్ అయ్యాయి. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే డైలాగ్‌ను ఇప్పుడు పాడి కౌశిక్‌రెడ్డి త‌న స్ట‌యిల్‌లో రిపీట్ చేశారు.


కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. అయితే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

First Published:  18 March 2024 7:44 AM GMT
Next Story