Telugu Global
Telangana

5 లక్షల మందితో ఖమ్మంలో బీఆరెస్ సభ... ఖమ్మం నేతలతో కేసీఆర్ చర్చ‌

ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామానాగేశ్వర్‌రావు, రవిచంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్‌, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ పాల్గొన్నారు. సాయంత్ర 5 గంటల నుంచి రాత్రి 8 గంటల‌ దాకా దాదాపు 3 గంటల‌ పాటు జరిగిన ఈ సమావేశంలో సభను విజయవంతం చేయడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో చర్చించారు.

5 లక్షల మందితో ఖమ్మంలో బీఆరెస్ సభ... ఖమ్మం నేతలతో కేసీఆర్ చర్చ‌
X

ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న బారత రాష్ట్ర సమితి బహిరంగసభ ఏర్పాట్ల గురించి చర్చించేందుకు బీఆరెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా బీఆరెస్ నాయకులతో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామానాగేశ్వర్‌రావు, రవిచంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్‌, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ పాల్గొన్నారు. సాయంత్ర 5 గంటల నుంచి రాత్రి 8 గంటల‌ దాకా దాదాపు 3 గంటల‌ పాటు జరిగిన ఈ సమావేశంలో సభను విజయవంతం చేయడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో చర్చించారు.

Advertisement

ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న ఈ బహిరంగ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ లు వస్తున్నందువల్ల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కేసీఆర్ ఖమ్మం నేతలను ఆదేశించారు.

ఈ సభ ద్వారా దేశ ప్రజలకు, రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. బీఆర్‌ఎస్‌ ద్వారా దేశ వ్యవసాయరంగంలో తీసుకొచ్చే మార్పులపై ఈ సభ ద్వారా వివరించనున్నట్టు సమాచారం. ఈ దేశ రాజకీయాల్లో బీఆరెస్ ఎలాంటి పాత్ర పోషించబోతుందీ 18న జరిగే బహిరంగ సభలో స్పష్టం చేస్తానని ఖమ్మం నాయకులతో కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.

Next Story