Telugu Global
Telangana

సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్ద‌న్‌రావు అక్కడికక్కడే మృతిచెందారు. యాక్సిడెంట్ తర్వాత రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం.

సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం
X

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నేత, నల్ల‌గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్ద‌న్‌ రావు (49) కన్నుమూశారు. నల్లగొండ పట్టణ శివారులో ఈ ప్రమాదంలో జరిగింది. నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం BMW కారులో (KA 03 MP 6914) హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్‌కు బైక్‌పై వెళ్తున్న సంధినేని జనార్ద‌న్‌ రావును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్ద‌న్‌రావు అక్కడికక్కడే మృతిచెందారు. యాక్సిడెంట్ తర్వాత రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం.

జనార్ద‌న్‌రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అందులో చురుకైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనార్ద‌న్‌రావు మృతి పట్ల కేసీఆర్ సహా బీఆర్ఎస్‌ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

First Published:  18 April 2024 1:58 AM GMT
Next Story