Telugu Global
Telangana

ఆ రెండింట్లో ఒక సీటివ్వండి, లేదంటే.. BRSకు బొంతు అల్టిమేటం..!

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన బొంతు రామ్మోహన్‌.. ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదంటూ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది.

ఆ రెండింట్లో ఒక సీటివ్వండి, లేదంటే.. BRSకు బొంతు అల్టిమేటం..!
X

బీఆర్ఎస్‌ లీడర్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ లోక్‌సభ సీటుపై కన్నేశారు. మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలియజేశానంటూ ట్వీట్ చేశారు బొంతు.

హైదరాబాద్‌ మేయర్‌గా సిటీ డెవలప్‌మెంట్‌ కోసం, పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు. ఒకే కుటుంబం వారికి అవకాశం ఇవ్వకుండా ఉద్యమకారులకు, పార్టీ కోసం కష్టపడ్డవారికి అవకాశం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పార్టీ పెద్దలపై తనకు విశ్వాసం ఉందన్న బొంతు.. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారనే నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు.


అయితే పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన బొంతు రామ్మోహన్‌.. ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదంటూ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. ఒకవేళ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే జంప్‌ అయ్యేందుకు సిద్ధమని ఆయన హింట్‌ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఉప్పల్‌ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు బొంతు రామ్మోహన్‌. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా బండారు లక్ష్మారెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. ఆయన విజయం సాధించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి పార్టీ సాయి కుమార్‌కు అవకాశమిస్తుందా.. లేదా కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది.

First Published:  4 Feb 2024 10:32 AM GMT
Next Story