Telugu Global
Telangana

బలగం థీమ్‌తో బీఆర్ఎస్‌ యాడ్స్

ఈ యాడ్స్‌లో బలగం మూవీలో ప్రధాన పాత్రధారి కొమురయ్యతో పాటు ఇతర నటులు కనిపించారు. మొదటి సెట్‌లో 5 రకాల ప్రకటనలు ఉన్నాయి.

బలగం థీమ్‌తో బీఆర్ఎస్‌ యాడ్స్
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌ ప్రచారానికి మరింత పదును పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ రిలీజ్ చేసిన పాటలకు జనాల్లో మంచి ఆదరణ లభించగా.. ఇప్పుడు బలగం థీమ్‌ యాడ్స్‌తో జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌ సెట్‌ ప్రకటనలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శనివారం రిలీజ్ చేశారు.


ఈ యాడ్స్‌లో బలగం మూవీలో ప్రధాన పాత్రధారి కొమురయ్యతో పాటు ఇతర నటులు కనిపించారు. మొదటి సెట్‌లో 5 రకాల ప్రకటనలు ఉన్నాయి. ఈ ప్రకటనల్లో కొమురయ్య ప్రధాన పాత్రధారిలో ఉన్నారు. బీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణ పల్లెల్లో వచ్చిన మార్పు, సంక్షేమ ఫలాలను ఈ యాడ్స్‌ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాల్సిన అవసరాన్ని ఈ యాడ్స్‌లో వివరించారు.


ఇక ఇప్పటికే గులాబీల జెండాలమ్మ పాట, ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనుందంటూ మాట్ల తిరుపతి రాసిన పాటతో పాటు ఔర్ ఏక్‌ దక్కా కేసీఆర్ పక్కా సాంగ్స్‌ బీఆర్ఎస్‌ ప్రచారాల్లో ఊపు ఊపుతున్నాయి.

First Published:  12 Nov 2023 4:07 AM GMT
Next Story