Telugu Global
Telangana

భట్టి.. మరి ఇదేంటి.. కరెంటు కోతలపై BRS కౌంటర్‌

కరెంటు కోతల విషయమై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష BRS పార్టీల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అయితే కరెంటు కోతలు లేవని.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్ చేశారు.

భట్టి.. మరి ఇదేంటి.. కరెంటు కోతలపై BRS కౌంటర్‌
X

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరెంటు కోతలు పెరిగాయి. సామాన్యులు సైతం కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. రోజులో 2 గంటలకు మించి కరెంటు కోతలు ఉంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.

కరెంటు కోతల విషయమై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష BRS పార్టీల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అయితే కరెంటు కోతలు లేవని.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్ చేశారు. ఓ వివరణ కూడా ఇచ్చారు. 2023 డిసెంబర్, 2024 జ‌న‌వ‌రి నెలల్లో గతంలో కంటే ఎక్కువ‌ విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రిగింద‌ని వివరించారు. తెలంగాణలో విద్యుత్ సరఫరా గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిందన్నారు. 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో సగటున ప్రతి రోజు 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగితే, 2023 డిసెంబర్ నెలలో సగటు 207.7 మిలియన్ యూనిట్లకు పెరిగిందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఇక 2024 జనవరి 1 నుండి 28 వరకు, రాష్ట్రంలో రోజుకి సగటున 242.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా తమ ప్రభుత్వం చేస్తే గత ఏడాది ఇదే కాలానికి సగటున 226 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశారని భట్టి స్పష్టం చేశారు.


ఇదే విషయాన్ని ట్విట్టర్‌లోని అధికారిక ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ హ్యాండిల్‌లోనూ పోస్టు చేశారు. అయితే ఈ ట్వీట్‌ కింద చాలా మంది పౌరులు కరెంటు కోతల అంశంపై భట్టిని తప్పు పట్టారు. రోజులో రెండు గంటలకు మించి కరెంటు కోతలు ఉంటున్నాయని కామెంట్స్ పెట్టారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎత్తి చూపింది. ఫ్యాక్ట్ చెక్‌లోనూ ఫేక్‌ వార్తలు రాస్తున్నారని విమర్శించింది.

First Published:  30 Jan 2024 7:46 AM GMT
Next Story