Telugu Global
Telangana

కేజ్రీవాల్ అరెస్టు.. కేసీఆర్ రియాక్షన్ ఇదే

ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటుందన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

కేజ్రీవాల్ అరెస్టు.. కేసీఆర్ రియాక్షన్ ఇదే
X

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయన్నారు కేసీఆర్.


ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటుందన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేజ్రీవాల్ అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు కేసీఆర్. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని.. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ఆప్ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఎంపీ సంజయ్‌ సింగ్‌లను అరెస్టు చేసిన ఈడీ.. గత వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది.

First Published:  22 March 2024 5:27 PM GMT
Next Story