Telugu Global
Telangana

'పిరమైన మోడీజీ',ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్‌ను రద్దు చేయండి... కేటీఆర్ డిమాండ్

పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడిందని, అవి దేశంలో ఆకాశాన్నంటుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇంధనంపై అదనపు ఎక్సైజ్‌ సుంకం, సెస్‌ను ఎత్తివేస్తే ధరలు ఆటోమేటిక్‌గా తగ్గుతాయని ఆయన చెప్పారు.

పిరమైన మోడీజీ,ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్‌ను రద్దు చేయండి... కేటీఆర్ డిమాండ్
X

పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రజలు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాలు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నదని, అందువల్ల ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్‌ను రద్దు చేయాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడిందని, అవి దేశంలో ఆకాశాన్నంటుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇంధనంపై అదనపు ఎక్సైజ్‌ సుంకం, సెస్‌ను ఎత్తివేస్తే ధరలు ఆటోమేటిక్‌గా తగ్గుతాయని ఆయన చెప్పారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన కేటీఆర్,

ఉప్పు పిరం.. పప్పు పిరం..

పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం

గ్యాస్ పిరం..

గ్యాస్ పై వేసిన దోశ పిరం

అన్నీ పిరం.. పిరం...

జనమంతా గరం... గరం...

అందుకే అంటున్న

ప్రియమైన ప్రధాని... మోదీ కాదు..

“పిరమైన ప్రధాని.. మోదీ.."

మోదీ జీ, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకాలు, సెస్‌ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.'' అని కామెంట్ చేశారు.

Next Story