Telugu Global
Telangana

క్రిస్ మస్ తర్వాత ఊపందుకోనున్న బీఆరెస్ కార్యకలాపాలు... ఈ నెలాఖ‌రుకల్లా 6 రాష్ట్రాల్లో కిసాన్ సెల్ శాఖలుప్రారంభం

'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో దేశ రాజకీయ వేదిక మీదికి వచ్చిన బీఆరెస్ ఈ నెలాఖ‌రులోగా మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, కర్నాటక,హర్యాణా, తెలంగాణ రాష్ట్రాల్లో కిసాన్ సెల్ శాఖలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

క్రిస్ మస్ తర్వాత ఊపందుకోనున్న బీఆరెస్ కార్యకలాపాలు... ఈ నెలాఖ‌రుకల్లా 6 రాష్ట్రాల్లో కిసాన్ సెల్ శాఖలుప్రారంభం
X

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు దేశ రాజకీయాల్లో ఓ కదిలిక తెచ్చింది. దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదిరి చూస్తున్నారని బీఆరెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి అనేక సంఘాలు, రైతులు, ఇతర రంగాల ప్రజలు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో దేశ రాజకీయ వేదిక మీదికి వచ్చిన బీఆరెస్ ఈ నెలాఖ‌రులోగా మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, కర్నాటక,హర్యాణా, తెలంగాణ రాష్ట్రాల్లో కిసాన్ సెల్ శాఖలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీఆరేస్ అధ్యక్షులు కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు , హర్యానాకు చెందిన రైతు నాయకుడు బీఆరెస్ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ లు అన్ని రాష్ట్రాల రైతు నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు.

బీఆరెస్ భావజాల వ్యాప్తి కోసం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయా భాషల్లో పాటలు రాయించడం, పాడి రికార్డ్ చేయడం తదితర కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అనేక రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు,కళాకారులతో కేసీఆర్ స్వయంగా దిశా నిర్దేషం చేసినట్టు తెలుస్తోంది.


ఈ నెల 26న కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నట్టు సమాచారం కొద్ది రోజులు అక్కడే ఉండి వివిధ రాష్ట్రాల్లో బీఆరెస్ కార్యక్ర‌మాలను గైడ్ చేస్తారని తెలుస్తోంది. అదే క్రమంలో కేసీఆర్ ఢిల్లీ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశంలో కేసీఆర్ బీఆరెస్ విధి విధానాలు ప్రకటించే అవకాశాలున్నాయి.

First Published:  20 Dec 2022 2:44 PM GMT
Next Story