Telugu Global
Telangana

షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్‌.. ఒంటరిపోరుకు స‌న్న‌ద్ధం..!

విలీనంపై కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసం వేచి చూసిన షర్మిల ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం.

షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్‌.. ఒంటరిపోరుకు స‌న్న‌ద్ధం..!
X

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ఇదిగో విలీనం, అదిగో ప్రకటన అంటూ హడావుడి చేసినప్పటికీ.. ఇప్పుడీ అంశంపై అటు వైఎస్సార్టీపీ నేతలు గానీ, ఇటు కాంగ్రెస్ నేతలు గానీ నోరు మెదపడం లేదు. మరోవైపు 119 స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేసేందుకు కాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం లేనట్లేనని ప్రచారం జోరందుకుంది.

విలీనంపై కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసం వేచి చూసిన షర్మిల ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. విలీనం లేకపోతే తెలంగాణలోని 119 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని షర్మిల గతంలోనే స్పష్టం చేశారు. ఈ నెల 9 నుంచి బీఫామ్ దరఖాస్తులు కూడా తీసుకునేందుకు YSRTP రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇక షర్మిల పాలేరు స్థానం నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్‌ నుంచి తుమ్మల టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పాలేరులో పోటీ రసవత్తరంగా మారనుంది.

First Published:  6 Oct 2023 4:20 PM GMT
Next Story